![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -220 లో.... జ్యోత్స్నని దీప కాపాడుతుంది. దాన్ని కూడా శివన్నారాయణ తప్పుగా అర్థం చేసుకొని దీపని తప్పు పడతాడు. దాంతో కార్తీక్ ఇంటికి వచ్చాక దీప సాయం చేసింది మర్చిపోయి తిడుతున్నాడు. ఆ విషయం కూడా వాళ్లకి ఫోన్ చేసి చెప్పింది దీపే.. అలాంటిది తననే అంటున్నాడని కాంచనతో కార్తీక్ అంటాడు. చెప్పింది విన్నాక అర్థం చేసుకున్నాడు బాబు.. మీరు ఆవేశపడకండి అని దీప అంటుంది.
ఆ తర్వాత శౌర్యా ఆరోగ్యం గురించి తెలుసుకోవడం వీలు కాలేదని దీప అనుకుంటుంది. డాక్టర్ ఏమన్నాడు శౌర్య అని దీప అడుగుతుంది. నాన్న మాట్లాడాడని శౌర్యా చెప్తుంది. అయిన దీపకి డౌట్ ఉంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి ఎందుకు అలా చేస్తున్నావ్ దీప.. ఇంకా ఆ భయం ఎందుకని కార్తీక్ అంటాడు. బాధ్యత మొత్తం తండ్రి పైనే ఉంటే ఎలా అని దీప అనగానే.. థాంక్స్ దీప నన్ను శౌర్యకి తండ్రి అన్నందుకు అని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి దాస్ వస్తాడు. పారిజాతాన్ని బయటకు పంపించి.. నువ్వు కావాలనే దీపని చంపాలనుకున్నావంటూ నిలదీస్తాడు కానీ జ్యోష్న ఏదో డైవర్ట్ చెయ్యాలని అనుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కి దాస్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే కాశీ కూడా జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. శివన్నారాయణ వచ్చేసరికి అందరు ఉండడంతో వాళ్ళని పంపించమని కోప్పడతాడు.
ఆ తర్వాత దీప అసలు అయిన వారసురాలని నీకు చెప్పడం అనవసర.. అందుకే చెప్పడం లేదని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ దగ్గరికి దీప వచ్చి.. బాబు ఒకసారి జ్యోత్స్నకి ఎలా ఉందో కనుక్కోండి అని అంటుంది. నేను అడగనని కార్తీక్ అనగా.. అడుగు రా అని కాంచన అంటుంది. నువ్వు అడుగు అని కార్తీక్ అంటాడు. మీ పిన్ని అక్కడే ది కదా అడుగమని కాంచనతో అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |